హైలైట్స్
- ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తోన్న Realme Pad Slim ట్యాబ్లెట్
- Realme Pad Slim ప్రారంభ ధర రూ.32,999
- 10.4-ఇంచ్ డిస్ప్లే, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానున్న Realme Pad Slim
జనవరి 9 న భారత్ లో Realme Pad Slim ట్యాబ్లెట్ లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ ఫ్లిప్ కార్ట్ లో లిస్ట్ అవ్వడంతో సమాచారం బయటకు వచ్చింది. అయితే లాంచ్ ఈవెంట్ ఏమీ లేకుండా నేరుగా ఫ్లిప్ కార్ట్ పై Realme Pad Slim కనిపించడం గమనార్హం. కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఈ డివైజ్ గురించి ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు Realme Pad Slim యొక్క ధర, స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. అవెలా ఉన్నాయో చూద్దాం పదండి.
Realme Pad Slim ధర
Realme Pad Slim ట్యాబ్లెట్ యొక్క ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తోంది. ఈ పేజీ ద్వారా Realme Pad Slim యొక్క ధర, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Realme Pad Slim ధర రూ.32,999 గా ఉంది. అయితే, లాంచ్ ప్రైస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ జనవరి 9 న భారత్ లో లాంచ్ అవుతోంది. త్వరలోనే కంపెనీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లేదంటే నేరుగా అమ్మకాలు జరుగుతాయోమో చూడాలి.
Realme Pad Slim స్పెసిఫికేషన్స్
- 10.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే
- 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
- వై-ఫై + 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ
- మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్
- 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫ్లిప్ కార్ట్ లో మెన్షన్ చేసిన విధంగా Realme Pad Slim ట్యాబ్లెట్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వస్తోంది. ఈ ట్యాబ్లెట్ ని వై-ఫై మరియు సిమ్ కార్డ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. Realme Pad Slim ట్యాబ్లెట్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గోల్డ్ మరియు గ్రే.
Realme Pad Slim ట్యాబ్లెట్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తోంది. ప్రాసెసింగ్ కోసం ఇందులో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ వాడారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ఈ ట్యాబ్లెట్ పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ట్యాబ్లెట్ లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇప్పుడు Realme Pad Slim యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ట్యాబ్లెట్ లో 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరాని అందించారు. వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. కొన్ని ట్యాబ్లెట్స్ లో 2ఎంపి లేదా 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇస్తుండటం మనం చూస్తున్నాం. వాటితో పోల్చితే ఇందులో ముందు, వెనక 8ఎంపి కెమెరాలను అందించడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రానున్న రోజుల్లో మరింత హై-రెజుల్యూషన్ కెమెరాలు ట్యాబ్లెట్స్ లో అందించాలని ఆశిద్దాం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.