చైనాలో బాగా పేరు గడించిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nubia తాజాగా అక్కడ RedMagic 8S Pro, RedMagic 8S Pro+ డివైజ్ లను లాంచ్ చేసింది. ఇక RedMagic 8S Pro+ డివైజ్ ప్రపంచపు మొట్టమొదటి 24జిబి ర్యామ్ ఫోన్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఫిజికల్ ర్యామ్ కలిగిన ఫోన్ మరొకటి లేదు. RedMagic 8S Pro+ మరియు RedMagic 8S Pro డివైజెస్ రెండు కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 అడ్వాన్స్డ్ ఎడిషన్ చిప్సెట్ తో వచ్చాయి. ఈ చిప్ 3.36 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.
RedMagic 8S Pro సిరీస్ ఫోన్లలో ఇండెపెండెంట్ గేమింగ్ చిప్ కూడా ఉంది. దీన్ని Red Core R2 చిప్ గా పిలుస్తున్నారు. షోల్డర్ కీస్, వైబ్రేషన్స్, లైటింగ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ని మెరుగుపరిచేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుంది.
RedMagic 8S Pro ధర
- 8జిబి+128జిబి మోడల్ ధర RMB 3,999 (సుమారు రూ.45,400)
- 8జిబి+256జిబి మోడల్ ధర RMB 4,399 (సుమారు రూ.50,000)
- 12జిబి+256జిబి మోడల్ ధర RMB 4,799 (సుమారు రూ.54,500)
- 12జిబి+256జిబి ట్రాన్స్పరెంట్ మోడల్ ధర RMB 5,499 (సుమారు రూ.62,400).
RedMagic 8S Pro+ ధర
- 16జిబి+256జిబి మోడల్ ధర RMB 5,499 (సుమారు రూ.62,500)
- 16జిబి+512జిబి మోడల్ ధర RMB 5,799 (సుమారు రూ.65,800)
- 16జిబి+256జిబి ట్రాన్స్పరెంట్ మోడల్ ధర RMB 5,699 (సుమారు రూ.64,700)
- 16జిబి+512జిబి ట్రాన్స్పరెంట్ మోడల్ ధర RMB 5,999 (సుమారు రూ.68,100)
- 16జిబి+1టిబి ట్రాన్స్పరెంట్ మోడల్ ధర RMB 6,999 (సుమారు రూ.79,500)
- 24జిబి+1టిబి మోడల్ ధర RMB 7,499 (సుమారు రూ.85,100)
- 16జిబి+512జిబి Bumblebee Edition ధర RMB 6,499 (సుమారు రూ.73,800).
RedMagic 8S Pro, RedMagic 8S Pro+ స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: RedMagic 8S Pro, RedMagic 8S Pro+ డివైజెస్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2480*1116 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 960 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1300 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1440 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: RedMagic 8S Pro+ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ అడ్వాన్స్డ్ ఎడిషన్ చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: RedMagic 8S Pro+ టాప్ మోడల్ 24జిబి ర్యామ్ + 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని కలిగి ఉంది. స్టాండర్డ్ వర్షన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.
- ఓఎస్: RedMagic 8S Pro+, RedMagic 8S Pro స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రెడ్‌మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: రెండు ఫోన్లలో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ: RedMagic 8S Pro+, RedMagic 8S Pro డివైజెస్ లో 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్+ గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.
- బ్యాటరీ: RedMagic 8S Pro+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 165 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరోవైపు RedMagic 8S Pro లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
