Home News సైలెంట్ గా Redmi 10 5G ని లాంచ్ చేసిన రెడ్మీ

సైలెంట్ గా Redmi 10 5G ని లాంచ్ చేసిన రెడ్మీ

హైలైట్స్:

సైలెంట్ గా థాయిలాండ్, ఇండోనేషియాల్లో రెడ్మీ 10 5జీ ఫోన్ ని రెడ్మీ సంస్థ లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర 200 డాలర్ల కంటే తక్కువ ధరను కలిగి ఉండనుంది. రెడ్మీ 10 5జీ లో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, పొడవైన యాస్పెక్ట్ రేషియో, డైమెన్సిటీ 7 సిరీస్ చిప్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, భారీ బ్యాటరీ ఈ ఫోన్లో ఉండనున్నాయి.

Redmi 10 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

రెడ్మీ 10 5జీ ఫోన్ 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ 1080*2048, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ని కలిగి ఉంది. డివైజ్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే ఈ డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ని కలిగి ఉంది. ఈ ఫోన్ మల్టీపుల్ వేరియంట్స్ లో లభ్యం కానుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

రెడ్మీ 10 5జీ డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.1, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 200 గ్రాములు. మార్చి లో చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11ఈ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా రెడ్మీ 10 5జీ మార్కెట్ లోకి వచ్చింది.

Redmi 10 5G ధర, లభ్యత

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా 180 డాలర్లు మరియు 194 డాలర్లు గా ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ అరోరా గ్రీన్, క్రోమ్ సిల్వర్, గ్రాఫైట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ దొరకనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే ఈ డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇక రెడ్మీ 10 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ కానుందో ఇంకా తెలియదు. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి భారత మార్కెట్ లో దీని ధర రూ.15000 నుంచి రూ.16000 మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో భారత లాంచ్ కి సంబంధించి అధికార సమాచారం వచ్చే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.