భారత్ లో లాంచ్ అయిన చౌకైన Redmi ఫోన్.. ధర, ఫీచర్లు ఇవిగో..!!

హైలైట్స్:

  • భారత్ లో రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ని లాంచ్ చేసిన రెడ్ మీ
  • షావోమీ వెబ్ సైట్ లో కనిపించిన రెడ్ మీ 10ఏ స్పోర్ట్
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. షావోమీ అఫీషియల్ గా ఫోన్ ని లాంచ్ చేయలేదు. కానీ, కంపెనీ యొక్క వెబ్ సైట్ లో ఈ ఫోన్ దర్శనమిచ్చింది. గతేడాది లాంచ్ అయిన రెడ్ మీ 10ఏ వర్షన్ కి ఈ ఫోన్ అప్ గ్రేడ్ వర్షన్. రెడ్ మీ 10ఏ తో పోల్చితే, స్పోర్ట్ ఎడిషన్ లో ర్యామ్ మరియు స్టోరేజీని పెంచారు. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ అయిన రెడ్ మీ 10ఏ స్పోర్ట్, రెడ్ మీ 9ఏ స్పోర్ట్ కి సక్సెసర్. ఇక రెడ్ మీ 10ఏ స్పోర్ట్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, లాంగ్ డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, స్ట్రాంగ్ బ్యాటరీ ఉన్నాయి. రెడ్ మీ 10ఏ కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Redmi 10A Sport ధర, సేల్

రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ మరియు 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. చార్కోల్ బ్లాక్, స్టేట్ గ్రే, సీ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. భారత్ లో రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ధర రూ.10,999. రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ ని షావోమీ ఇండియా వెబ్ సైట్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi 10A Sport లాంచ్ ఆఫర్

షావోమీ ఇండియా వెబ్ సైట్ ద్వారా రెడ్ మీ 10ఏ స్పోర్ట్ ని కొనుగోలు చేస్తే, రూ.750 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. MBK750 కూపన్ కోడ్ ఉపయోగించి, మొబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రెడ్ మీ 10ఏ స్పోర్ట్ పై 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.దీంతో పాటు సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై 10శాతం (రూ.750 వరకు ) డిస్కౌంట్ పొందవచ్చు.

Redmi 10A Sport స్పెసిఫికేషన్స్

  • 6.53 అంగుళాల ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే
  • 13ఎంపి రియర్ కెమెరా
  • 5ఎంపి రియర్ కెమెరా
  • మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
  • 6జిబి + 128జిబి
  • 5,080ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్

6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 12.5 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు రెడ్ మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం విశేషాలు చూద్దాం. ఈ ఫోన్లో 5 మెగాపిక్సెల్ ప్రంట్ కెమెరాను అందించారు. వెనుకవైపున స్క్వేర్ షేపులో ఉన్న మాడ్యూల్ లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 2జిబి వర్చువల్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్, 4జీ వోల్టీ, వైఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Previous articleభారత్ లో నేటి నుంచి Google Pixel 6a సేల్ ప్రారంభం, కొనచ్చంటారా?
Next articleSamsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.