Home News Redmi 11 Prime 5G తో పాటు లాంచ్ కానున్న Redmi 11 Prime 4G

Redmi 11 Prime 5G తో పాటు లాంచ్ కానున్న Redmi 11 Prime 4G

హైలైట్స్:

Redmi 11 Prime 5G సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోంది. దీవాళి విత్ మీ (Diwali With Mi) సేల్ లో భాగంగా ఈ ఫోన్ వస్తోంది. అయితే ఈ ఫోన్ తో పాటు రెడ్మీ 11 ప్రైమ్ 4జీ కూడా ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్, కొన్ని ముఖ్యమైన హార్డ్‌వేర్ వివరాలు తెలిశాయి. హ్యాండ్సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. అమెజాన్ లో ఫోన్ కి సంబంధించిన ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ ఆన్‌లైన్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు స్పష్టమైంది. మీరు కూడా ఓసారి అమెజాన్ లో ఉన్న మైక్రోసైట్ పై ఓ లుక్ వేయండి.

రెడ్మీ 11 ప్రైమ్ 4జీ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోంది. కాగా, ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. అలాగే భద్రత కొరకు ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు.

Redmi 11 Prime 4G స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ తో పాటు సెప్టెంబర్ 6 న భారత్ లో అడుగుపెడుతోంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్, హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో అర్థమైంది.మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ని ఈ ఫోన్లో అమర్చారు. మీడియాటెక్ నుంచి మార్కట్ లోకి వచ్చిన సరికొత్త చిప్సెట్ ఈ హీలియో జీ99. రెడ్మీ 11 ప్రైమ్ 4జీ ఫోన్ ని చూస్తుంటే, ఇది పోకో ఎమ్ 5 కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. పోకో ఎమ్ 5 సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతోంది. రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ లో కెమెరా ప్లేస్మెంట్ పోకో ఎమ్ 5 ఫోన్ లో మాదిరి ఉంది. దీంతో ఇది పోకో ఎమ్ 5 రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపి ప్రైమరీ కెమెరా, రెండు ఇతర కెమెరాలు ఉన్నాయని అమెజాన్ మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశముంది. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయని అంచనా. రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.12000 ఉంటుందని సమాచారం. త్వరలో ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.