హైలైట్స్
- Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్
- రూ.13,999 ధరతో సెప్టెంబర్ లో లాంచైన Redmi 11 Prime 5G
- తగ్గింపు ధరతో ప్రస్తుతం రూ.12,999 కే లభించనున్న Redmi 11 Prime 5G
భారత్ లో Redmi 11 Prime 5G రెండు వేరియంట్స్ లో లాంచైంది. అవి: 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ. క్రోమ్ సిల్వర్, మీడో గ్రీన్, థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫోన్ లో ఫర్వాలేదనిపించే ఫీచర్లు ఉన్నాయి.
Redmi 11 Prime 5G కొత్త ధర, లభ్యత
Redmi 11 Prime 5G 4జిబి ర్యామ్, 64జిబి వేరియంట్ రూ.12,999 కే లభిస్తుంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 కి లభిస్తుంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్ సైట్ లో కొత్త ధరలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
Redmi 11 Prime 5G స్పెసిఫికేషన్స్
Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచైంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్ లో ఫోన్ లభించనుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.
Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Redmi 11 Prime 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, హై-రెస్ ఆడియో తో వచ్చింది. వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Redmi 11 Prime 5G లో యాక్సలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఎలక్ట్రానిక్ కంపాస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 తో లాంచైన ఈ ఫోన్ త్వరలోనే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ పొందనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.