Home News సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G

సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Redmi 11 Prime 5G

హైలైట్స్:

రానున్న వారాల్లో రెడ్మీ కంపెనీ భారత్ లో ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమేరకు 91మొబైల్స్ కి సమాచారం లభించింది. ప్రముఖ టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ మాతో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. యోగేశ్ చెప్పిన దాన్ని బట్టి త్వరలో రెడ్మీ నుంచి రెడ్మీ 11 ప్రైమ్ ఫోన్ భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెడ్మీ 11 సిరీస్ లో కొత్త మెంబర్ చేరబోతున్నట్లు స్పష్టమవుతోంది. చూస్తుంటే ఈ డివైజ్ రెడ్మీ నోట్ 11ఈ 5జీ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తోంది. 11ఈ 5జీ మార్చిలో చైనాలో లాంచ్ అయ్యింది.

Redmi 11 Prime 5G విశేషాలు

బ్రార్ చెబుతున్న దాన్ని బట్టి, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్, రెడ్మీ నోట్ 11ఈ 5జీ మాదిరి ఉండనుంది. దీంతో Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 11ఈ లో కూడా ఇదే చిప్సెట్ అందించారు.

ఇతర ముఖ్య ఫీచర్లను చూస్తే, చైనా వర్షన్ లో 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ 90 హెర్ట్జ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ రెజుల్యూషన్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఓవరాల్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ బడ్జెట్ సెగ్మెంట్ కు సరిపోయేలా ఉంటాయి. అలాగే ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఈ ఫోన్లో యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

షావోమీ రీసెంట్ గా 7 మిలియన్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ని భారత్ లో డెలివరీ చేసినట్లు షావోమీ తెలిపింది. మింట్ కథనం ప్రకారం, షావోమీ తన సబ్-బ్రాండ్స్ అయిన రెడ్మీ, పోకో లతో కలిసి భారత్ లో 5జీ షిప్మెంట్స్ చేరవేత లో 3 వ ర్యాంక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాప్-2 లో వరుసగా శాంసంగ్, వివో కంపెనీలు ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యధిక హ్యాండ్సెట్స్ అమ్మి అగ్ర స్థానంలో ఉన్న షావోమీ గత కొన్ని రోజులుగా మార్కెట్ లో పోటీ ఎక్కువ అవుతుండటంతో క్రమంగా వెనుకబడి పోతోంది. అయితే ఇప్పటికి కూడా షావోమీకి మంచి ఆదరణే ఉంది. 5జీ షిప్మెంట్స్ విషయంలో మరిన్ని జనాకర్షక ఫోన్లను తీసుకొస్తే, షావోమీ ఈ సెగ్మెంట్ లో కూాడా టాప్ ప్లేస్ కి వెళ్ళే అవకాశముంది.

Redmi 11 Prime 5G Specs

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.