హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Redmi 11A స్మార్ట్ ఫోన్
- 50ఎంపి కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
- IMDA సర్టిఫికేషన్ పై కనిపించిన Redmi 11A డివైజ్
Redmi బ్రాండ్ త్వరలో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Redmi 11A. ఈ డివైజ్ ఇదివరకు TENAA, BIS డేటాబేస్ లపై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ IMDA డేటాబేస్ పై దర్శనమిచ్చింది. 22120RN86G అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇండియన్ వేరియంట్ 22120RN86I, చైనీస్ వేరియంట్ 22120RN86C అనే మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి. MySmartPrice ఈ ఫోన్ యొక్క ఐఎండీఏ లిస్టింగ్ ని తొలుత గుర్తించింది. అయితే ఈ లిస్టింగ్ ద్వారా ఏ స్పెసిఫికేషన్స్ కూడా వెల్లడి కాలేదు.
అయితే ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, Redmi 11A డివైజ్ చైనాతో పాటు భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో కూడా లాంచ్ అవుతోంది. ఈ హ్యాండ్సెట్ Redmi 10A కి సక్సెసర్ గా వస్తోంది. ఈసారి వస్తున్న కొత్త మోడల్ కొన్ని ముఖ్యమైన మార్పులతో వస్తుందని అంచనా వేస్తున్నారు.
Redmi 11A స్పెసిఫికేషన్స్ (అంచనా)
Redmi 11A స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా TENAA లిస్టింగ్ పై కనిపించింది. దాని ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం. Redmi 11A 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 2.0 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్సెట్ 2జిబి/4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 32జిబి/64జిబి/128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నట్లు సమాచారం.
Redmi 11A స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్టాండర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. Redmi 11A ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే 50ఎంపి కెమెరాపై ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. ఇది ఉండొచ్చు లేదా వేరే సెన్సర్ వాడవచ్చు. ఇప్పటికి Redmi 11A కి సంబంధించి మా వద్ద ఉన్న సమాచారం ఇదే.
Redmi 11A డివైజ్ చైనాతో పాటు భారత్ మరియు ఇతర మార్కెట్స్ లో కూడా లాంచ్ అవుతోంది. ఈ హ్యాండ్సెట్ Redmi 10A కి సక్సెసర్ గా వస్తోంది. ఈసారి వస్తున్న కొత్త మోడల్ కొన్ని ముఖ్యమైన మార్పులతో వస్తుందని అంచనా వేస్తున్నారు. చైనా లాంచ్, గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ తేదీలు త్వరలోనే ప్రకటించబడనున్నాయి. ఈ ఫోన్ ధర కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉండనుంది. మార్కెట్ లో ఇతర కంపెనీల ఎంట్రీ లెవెల్ ఫోన్స్ గట్టి పోటీ ఇస్తుండటంతో, రెడ్మీ కూడా అందుకు తగినట్లుగానే తన ఫోన్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి రియల్మీ నుంచి రెడ్మీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












