Home News 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన Redmi 12 5G

8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో భారత్‌లో లాంచైన Redmi 12 5G

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Redmi 12 5G
  • క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వచ్చిన Redmi 12 5G
  • 16జిబి వరకు ఆఫర్ చేస్తున్న Redmi 12 5G

షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో తన కొత్త నంబర్ సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Redmi 12 సిరీస్ లో భాగంగా Redmi 12 5G స్మార్ట్ ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ సరసమైన ధరలో మిడ్-లెవెల్ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. సరే, ఓసారి Redmi 12 5G ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 12 5G డిజైన్

Redmi 12 5G డివైజ్ స్పెషల్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ లో సెన్సర్స్ ఉన్నాయి. బాటమ్ లో రెడ్మీ బ్రాండింగ్ ఉంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వచ్చింది. మొత్తం మీద, ఫోన్ ప్రీమియమ్ లుక్ ని కలిగి ఉంది.

Redmi 12 5G స్పెసిఫికేషన్స్

భారత్ లో Redmi 12 5G ధర

Redmi 12 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఇక టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,499 గా నిర్ణయించారు.