
Xiaomi సబ్-బ్రాండ్ Redmi ఇటీవలె గ్లోబల్ మార్కెట్ లో Redmi 13 4G ని లాంచ్ చేసింది. ఇప్పుడు 5జీ వేరియంట్ Redmi 13 5G ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో సదరు కంపెనీ ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ 5జీ మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, మోడల్ నంబర్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Redmi 13 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 2406ERN9CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
మోడల్ నంబర్ లోని C అక్షరం చైనా వేరియంట్ ను సూచిస్తోంది. 2406 నంబర్లు జూన్ నెలలో ఫోన్ లాంచ్ ఉంటుందని తెలియజేస్తోంది.
Redmi 13 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇంకా అడ్రెనో 612 జీపీయూ లిస్టింగ్ పై కనిపించింది.
Redmi 13 5G స్మార్ట్‌ఫోన్ 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది.

గతంలో Redmi 13 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ సైట్ పై కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా పంచ్ హోల్ కటౌట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యాయి.
Redmi 13 5G లాంచ్ వివరాలను షావోమి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Redmi 13 4G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi 13 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ (1800*2400 పిక్సెల్స్), ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 396పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi 13 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వినియోగించారు.
మెమొరీ: Redmi 13 4G డివైజ్ 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
సాఫ్ట్‌వేర్: Redmi 13 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Redmi 13 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Redmi 13 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Redmi 13 4G లో ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్కేడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Redmi 13 4G లో 168.6 మి.మీ పొడవు, 76.28 మి.మీ వెడల్పు, 8.17 మి.మీ మందం, 198.5 గ్రాముల బరువు ఉంటుంది.











