Redmi 13 5G: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ 13 5జీ ఇండియా ధర

Highlights

  • జులై 9న Redmi 13 5G లాంచ్
  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • 5030 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 13 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 9వ తేదీన రెడ్మీ 13 5జీ భారత్ లో విడుదలవుతోంది. ఈలోపు డివైజ్ యొక్క ధర లీక్ అయ్యింది. 108ఎంపి మెయిన్ కెమెరా, 5030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లీకైన ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13 5G భారత మార్కెట్ ధర (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Redmi 13 5G యొక్క ధర వివరాలను రివీల్ చేశారు. లీక్ ప్రకారం, 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ మోడల్ ధర రూ.15,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సేల్ ప్రారంభంలో రూ.1,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుందని లీక్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ వేరియంట్స్ రూ.12,999 మరియు రూ.14,999 కి లభిస్తాయి.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13 5G క్రిస్టల్ గ్లాస్ డిజైన్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ పంచ్-హోల్ ఫ్లాట్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటాయి.

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

కెమెరా: Redmi 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Previous articleTecno Spark 20 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Next articleMotorola Edge 50: బీఐఎస్‌పై లిస్టైన మోటోరోలా ఎడ్జ్ 50
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.