Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్స్ లో రానుంది. రీసెంట్ గా Redmi 13C అన్బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా Redmi 13C 5G వేరియంట్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన కీలక విషయాలు తెలిసాయి. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క స్పెసిఫికేషన్స్, 3సీ లిస్టింద్ విశేషాలను తెలుసుకుందాం పదండి.
Redmi 13C 5G 3C లిస్టింగ్
- కొత్త Redmi ఫోన్ మోడల్ నంబర్ 23124RN87Cతో 3C సైట్ లో గుర్తించబడింది. ఈ మోడల్ చైనాకు చెందినదని అర్థమవుతోంది.
- లిస్టింగ్‌లో, ఫోన్ 10W ఛార్జింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది.
- ఇది చైనీస్ జాబితా అయినప్పటికీ, త్వరలోనే Redmi 13C 5G డివైజ్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- 3C వెబ్సైట్లో కనిపించడానికి ముందు, ఈ మొబైల్ IMEI ప్లాట్‌ఫారమ్‌లో మోడల్ నంబర్లు 23124RN87C, 23124RN87G మరియు 23124RN87Iతో గుర్తించబడింది.
- ఈ ఫోన్ యొక్క మోడల్ నంబర్లు భారతదేశంతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ ఉంటుందని తెలియజేస్తున్నాయి.
Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడనున్నారు.
- మెమొరీ: Redmi 13C 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Redmi 13C 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Redmi 13C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi 13C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.
