డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న Redmi 13C 5G

Highlights

  • అమెజాన్ పై లిస్టైన Redmi 13C 5G
  • డిసెంబర్ 6 న లాంచ్ అవుతోన్న డివైజ్
  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వస్తోన్న Redmi 13C 5G

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ Redmi 13C 5G అమెజాన్ ఇండియా వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. అయితే వెంటనే దీన్ని తొలగించారు. కానీ, ఈలోపే MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 6 న ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G అమెజాన్ లిస్టింగ్

  • సీ-సిరీస్ లో వస్తోన్న మొదటి 5జీ ఫోన్ Redmi 13C 5G. డిసెంబర్ 6 వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • అదే రోజున Redmi 13C 4G కూడా లాంచ్ కానుంది. ఇది కూడా అమెజాన్ లో లిస్ట్ అయ్యింది.
  • రెడ్మీ నుంచి అత్యంత చవకైన 5జీ ఫోన్ గా Redmi 13C 5G మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది.
  • భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా Redmi 13C 5G లాంచ్ కానుంది.
  • అమెజాన్ సైట్ లో Redmi 13C 5G డివైజ్ 3 విభిన్న రంగుల్లో దర్శనమిచ్చింది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi 13C 5G లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Redmi 13C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.