
Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Redmi 13C స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
- ఓఎస్: Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 16 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi 13C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Redmi 13C ధర
- Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక్క మెమొరీ వేరియంట్ లో గ్లోబల్ అమెజాన్ సైట్ లో లిస్ట్ అయ్యింది.
- 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దీని ధరను 140.54 డాలర్లు (సుమారు రూ.11,700) గా నిర్ణయించారు.
- Redmi 13C డివైజ్ మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.












