Home News Redmi 14C 4G: రివీలైన రెడ్మీ 14సీ 4జీ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Redmi 14C 4G: రివీలైన రెడ్మీ 14సీ 4జీ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Highlights
  • త్వరలో Redmi 14C 4G లాంచ్
  • రివీలైన గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్
  • 256జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో 14 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi 14C 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గత మోడల్ Redmi 13C 4G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఈ వివరాలను 91mobiles ఎక్స్‌క్లూజివ్‌గా తన కథనంలో ప్రచురించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi 14C 4G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ప్రకారం, Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో ఈ నెలాఖరులో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. త్వరలో రెడ్మీ నుంచి అధికార సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర గత మోడల్ రెడ్మీ 13సీ మాదిరి తక్కువ ఉంటుందని అంచనా.

Redmi 14C 4G స్టోరేజీ, ర్యామ్ మరియు కలర్ ఆప్షన్స్ (లీక్)

లీకైన వివరాల ప్రకారం, Redmi 14C 4G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.

Redmi 14C 4G డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Redmi 14C 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

Redmi 14C 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ 1.0 ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

Redmi 14C 4G డివైజ్ 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Redmi 13C 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 13C 4G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 13C 4G లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 4G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Redmi 13C 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi 13C 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi 13C 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi 13C 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.