Redmi 14C: 120Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ 14సీ, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • వియత్నాంలో రెడ్మీ 14సీ విడుదల
  • హీలియో జీ81-అల్ట్రా చిప్
  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Redmi 14C అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ Redmi 13C కి సక్సెసర్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Redmi 14C స్మార్ట్‌ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.88-ఇంచ్ డిస్ప్లే, హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్, 50ఎంపి కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 14C ధర

Redmi 14C స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ధరను VND 30,90,000 (సుమారు రూ.10,500) గా నిర్ణయించారు.

Redmi 14C డివైజ్ సేజ్ గ్రీన్ (లెదర్ బ్యాక్ ఫినిష్), మిడ్నైట్ బ్లాక్, డ్రీమీ పర్పుల్ మరియు స్టారీ బ్లూ (స్టారీ ట్రెయిల్ డిజైన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 14C స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో కూడా విడుదలవుతుంది.

Redmi 14C స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 14C లో 6.88-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, రీడింగ్ మోడ్, టీయూవీ లో బ్లూ లైట్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, డీసీ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 14C లో మీడియాటెక్ హీలియో జీ81-అల్ట్రా చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 ఎంసీ2 జీపీయూ ఇచ్చారు.

మెమొరీ: Redmi 14C స్మార్ట్‌ఫోన్ 4జిబి+128జిబి, 4జిబి+256జిబి, 6జిబి+128జిబి, 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 14C లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 14C డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Redmi 14C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: Redmi 14C లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Previous articleOPPO A60 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఒప్పో కొత్త ఫోన్
Next articleRealme: సెప్టెంబర్ 9న లాంచ్ అవుతోన్న Narzo 70 Turbo 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.