Home News Redmi 14R: 5160mAh బ్యాటరీతో చైనాలో లాంచైన రెడ్మీ 14ఆర్

Redmi 14R: 5160mAh బ్యాటరీతో చైనాలో లాంచైన రెడ్మీ 14ఆర్

Highlights
  • చైనాలో Redmi 14R విడుదల
  • 5160 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 8జిబి ర్యామ్, 120Hz స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi తాజాగా తన హోమ్ మార్కెట్ చైనాలో Redmi 14R అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. బేసిక్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లకు బాగా సరిపోతుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi 14R ధర, సేల్ వివరాలు

Redmi 14R స్మార్ట్‌ఫోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,099 యువాన్లు (సుమారు రూ.12,960) గా పెట్టారు. 6జిబి + 128జిబి వేరియంట్ ధరను 1,499 యువాన్లు (సుమారు రూ.17,680) గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 1699 యువాన్లు (సుమారు రూ.20,040) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,899 యువాన్లు (సుమారు రూ.22,400) గా పెట్టారు.

Redmi 14R భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

Redmi 14R స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్‌కి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఏ అధికార సమాచారం లేదు. అయితే, రెడ్మీ 14 సిరీస్ లో భాగంగా ఈ ఫోన్ కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Redmi 14R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi 14R లో 6.88-ఇంచ్ స్క్రీన్, 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi 14R లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ వాడారు. సాధారణ వాడకానికి ఈ చిప్సెట్ ఎంతో బాగా పని చేస్తుంది.

కెమెరా: Redmi 14R లో 13ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 14R లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Redmi 14R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi 14R లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, సింగిల్ స్పీకర్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.