హైలైట్స్:
- పేలిన Redmi 6A స్మార్ట్ ఫోన్, మృతి చెందిన నిద్రిస్తున్న మహిళ
- దిండు ప్రక్కన ఫోన్ పెట్టి నిద్రించిన మహిళ, ఉన్నపాటుగా పేలిన ఫోన్
- ట్వీట్ ద్వారా ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన మృతురాలి బంధువు
మానవుడి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఎంతో ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఇటీవలి కాలంలో ఫోన్ నుంచి మనిషిని వేరుగా చూడటం సాధ్యపడదు. మనిషి యొక్క నిత్యకృత్యాలు ఫోన్ తో నెరవేరుతున్నాయి. లాభాలతో పాటు ఫోన్ వల్లన రేడియేషన్ వంటి నష్టాలు కూడా ఉన్నాయి. అయితే అవసరం మేరకు మితంగా ఫోన్ ని వాడుకోవడం మంచిది. అదే పనిగా ఫోన్ కి అతుక్కుపోయి జీవితాన్ని కొనసాగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అయితే ఫోన్లు కొన్నిసార్లు పేలుతుండటం మనం చూశాం. తాజాగా చైనా కంపెనీ షావోమీ కి చెందిన Redmi 6A బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో ఒక మహిళ నిద్రిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
పేలిన Redmi 6A ఫోన్
Hi @RedmiIndia @manukumarjain@s_anuj Yesterday in Night my Aunty found dead ?, she was using Redmi 6A, she was sleeping & she kept the phone near her face on pillow side & after sometime her phone blast. It's a bad time for us. It's a responsibility of a brand to support? pic.twitter.com/9EAvw3hJdO
— MD Talk YT (Manjeet) (@Mdtalk16) September 9, 2022
మంజీత్ అనే వ్యక్తి Redmi 6A బ్లాస్ట్ అయ్యిందంటూ ఓ పోస్ట్ చేశాడు. అతని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన ఆంటీ Redmi 6A బ్లాస్ట్ అవ్వడం వల్లన చనిపోయిందంటూ అతడు తెలిపాడు. ఘటనకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఫోటోల్లో మృతురాలు రక్తపు మడుగులో కనిపిస్తోంది. పక్కన Redmi 6A పేలిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సదరు మహిళ తన Redmi 6A ఫోన్ ని దిండు కి పక్కన, తన ముఖానికి ఎదురుగా పెట్టుకుని నిద్రపోయింది. ఆ సమయంలో ఉన్నట్లుండి ఫోన్ పేలింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహిళ తలకు తీవ్ర గాయాలై మంచంపైనే తనువు చాలించింది. షేర్ చేసిన ఫోటోల్లో బెడ్ మొత్తం రక్తంతో నిండి ఉండటం గమనించవచ్చు.
సంతాపం ప్రకటించిన Xiaomi సంస్థ
రెడ్మీ కంపెనీకి మంజీత్ తన ట్వీట్ ను ట్యాగ్ చేశాక, సదరు సంస్థ నుంచి స్పందన వచ్చింది. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన షావోమీ పూర్తి విచారణ చేపడతామని హామీ ఇచ్చాయి. అయితే, షావోమీ మృతురాలి కుటుంబానికి ఏమైనా సాయం చేస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. ప్రమాదానికి కారణం మహిళ అజాగ్రత్తనా? లేక Redmi 6A ఫోన్ లో లోపం వల్లనా? అనేది విచారణలో బయటపడనుంది.
Redmi 6A స్పెసిఫికేషన్స్
- 5.45-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే
- మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్
- 2జిబి ర్యామ్
- 13ఎంపి ప్రైమరీ కెమెరా
- 5ఎంపి ఫ్రంట్ కెమెరా
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Redmi 6A ఫోన్లో 5.45 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ అమర్చారు. ఈ ఫోన్లో 2జిబి ర్యామ్ ఉంది. 13ఎంపి మెయిన్ కెమెరా ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది. అలాగే 3000 ఎంఏహెచ్ బ్యాటరీ Redmi 6A లో ఉంది.













