Home News అక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్

అక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్

హైలైట్స్

షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ రీసెంట్ గా Redmi A1 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi A1 ధర రూ.6,499. తాజాగా రెడ్మీ బ్రాండ్ Redmi A1+ స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 14 న భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. Redmi A1+ కూడా తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్.

అక్టోబర్ 14 న భారత మార్కెట్ లో Redmi A1+ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు Redmi India ప్రకటించింది. తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రొడక్ట్ పేజీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. ఇకపోతే Redmi A1+ ధర భారత్ లో రూ.8,000 గా ఉండనుందని సమాచారం. అయితే, అసలు ధర, పూర్తి వివరాల కోసం అక్టోబర్ 14 వరకు వేచి చూడక తప్పదు.

Redmi A1+ స్పెసిఫికేషన్స్

లీకైన సమాచారాన్ని బట్టి, Redmi A1+ స్మార్ట్ ఫోన్ 6.2-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో తో వస్తోంది. ఈ ప్యానెల్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ ని కలిగి ఉంది. Redmi A1+ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో వస్తోంది. అలాగే ఈ ఫోన్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ని కలిగి ఉంది.

ఇప్పుడు Redmi A1+ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi A1+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Redmi A1+ లో ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. Redmi A1+ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. భారత మార్కెట్ లో Redmi A1+ స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.