Home News భారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్

భారత్‌లో లాంచైన Redmi A2+ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్

Highlights
  • లాంచైన Redmi A2+ కొత్త స్టోరేజీ వేరియంట్
  • కొత్త మోడల్: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • Redmi A2+ ధర రూ.9,000 కన్నా తక్కువే

షావోమి సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A2+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. సరే, ఓసారి Redmi A2+ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi A2+ ధర

Redmi A2+ స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో వచ్చింది. దీని ధర రూ.8,499 గా ఉంది. ఇదివరకు కంపెనీ 64జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.7,999 ధరతో సేల్ కి అందుబాటులో ఉంది. షావోమి రిటైల్ పార్ట్నర్స్, అమెజాన్, ఎంఐ.కామ్ ద్వారా Redmi A2+ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ మరియు సీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Redmi A2+ స్పెసిఫికేషన్స్