
షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ భారత్ లో Redmi A2 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi A2 మరియు Redmi A2+. ఈ రెండు ఫోన్లు లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఈ రెండు ఫోన్లు 2023 ఆరంభంలో యూరప్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. ఏ2 సిరీస్ ని షావోమి ఈ ఏడాది అదే హార్డ్‌వేర్ తో భారత్ లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
Redmi A2 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Redmi A2+ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సరే, ఓసారి Redmi A2, Redmi A2+ డివైజెస్ ధరలు, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Redmi A2 సిరీస్ ధర, లభ్యత
Redmi A2 విభిన్న ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.5,999 గా ఉంది. 2జిబి + 64జిబి వేరియంట్ కూడా ఉంది. దీని ధరను రూ.6,499 గా నిర్ణయించారు. ఇక 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది. రూ.500 ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కలుపుకుని ఈ ధరకు లభిస్తుంది.
Redmi A2+ విషయానికి వస్తే, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది. ఇది సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో వచ్చింది. Redmi A2, Redmi A2+ డివైజెస్ రెండేళ్ళ వ్యారంటీతో వచ్చాయి. మే 23 నుంచి అమెజాన్ ద్వారా Redmi A2, Redmi A2+ ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. ఎంఐ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కూడా ఈ డివైజెస్ ని కొనుగోలు చేయవచ్చు.
Redmi A2 సిరీస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.52-ఇంచ్ స్క్రీన్
- 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Redmi A2 మరియు Redmi A2+ ఫోన్లలో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్ ఉంటాయి. రెండు ఫోన్ల బ్యాక్ ప్యానెల్ ఫాక్స్ లెదర్ ఫినిషింగ్ తో వచ్చింది.
కలర్ ఆప్షన్స్
- సీ గ్రీన్
- ఆక్వా బ్లూ
- క్లాసిక్ బ్లాక్
Redmi A2, Redmi A2+ స్మార్ట్ ఫోన్లు సీ గ్రీన్, ఆక్వా బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు స్క్రాచ్ రెసిస్టంట్ డిస్ప్లే మరియు స్ప్లాష్-రెసిస్టంట్ బాడీతో వచ్చాయి.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- మీడియాటెక్
Redmi A2, Redmi A2+ ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది. 4జిబి వరకు ర్యామ్, 64జిబి వరకు స్టోరేజీ ఈ ఫోన్లలో ఉన్నాయి.
కెమెరా విభాగం
- 8ఎంపి ప్రైమరీ
- 5ఎంపి ఫ్రంట్
Redmi A2, Redmi A2+ ఫోన్లలో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక క్యూవీజీఏ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్, కనెక్టివిటీ
- 5000 ఎంఏహెచ్
- 10 వాట్
Redmi A2, Redmi A2+ డివైజెస్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మైక్రో-యూఎస్బీ పోర్ట్ ని ఈ ఫోన్లలో అందించారు. డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, 3జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఎఫ్ రేడియో వంటివి ఈ ఫోన్లలో ఉంటాయి.











