Redmi: 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Redmi A3

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi A3
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • Redmi A3 ధర రూ.7,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi A3 డివైజ్ ని లాంచ్ చేసింది. గత మోడల్ Redmi A2 కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6జిబి వరకు ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi A3 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi A3 ధర

  • Redmi A3 స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Redmi A3 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది.
  • Redmi A3 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,299 గా ఉంది.
  • Redmi A3 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,299 గా ఉంది.
  • Redmi A3 స్మార్ట్‌ఫోన్‌ని ఫిబ్రవరి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ మరియు ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi A3 లో 6.71-ఇంచ్ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi A3 డివైజ్ 3జిబి/4జిబి/6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Redmi A3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో వర్షన్) ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi A3 లో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ + గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleNothing: మార్చి 5న భారత్‌లో లాంచ్ కానున్న Nothing Phone (2a)
Next articleOPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.