1.47-inch డిస్ప్లే, 14 రోజుల బ్యాటరీ లైఫ్ తో లాంచైన Redmi Band 2

Highlights

  • 100 వాచ్ ఫేసెస్ తో వచ్చిన Redmi Band 2
  • హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెన్సర్ తో వచ్చిన ఫిట్నెస్ ట్రాకర్
  • ఔట్‌డోర్ రన్నింగ్ మరియు యోగా వంటి 30+ స్పోర్ట్స్ మోడ్స్ తో వచ్చిన Redmi Band 2

 

షావోమి సబ్-బ్రాండ్ అయిన రెడ్మీ తాజాగా Redmi Band 2 ని మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ Redmi Band 2, 1.47-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 247పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. రెడ్మీ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఫిట్నెస్ ట్రాకర్ 210ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండి, 14 రోజుల బ్యాటరీ లైఫ్ ని ఇస్తుంది.

Redmi Band 2 లో 30+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెన్సర్ లతో ఈ ట్రాకర్ వచ్చింది. 5ATM వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ట్రాకర్ కలిగి ఉంది. సరే, ఓసారి Redmi Band 2 యొక్క స్పెసిఫికేషన్స్, ధర, ఇతర ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం. పదండి.

Redmi Band 2 ధర, లభ్యత

Redmi Band 2 ధర జపాన్ లో 4,990 యెన్‌లు (సుమారు రూ.3200) గా ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ క్రింద కొనుగోలుదారులు 4,490 యెన్‌లు (సుమారు రూ.2,800) ధరకే Redmi Band 2 ని సొంతం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. భారత్ లో Redmi Band 2 లభ్యతను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Redmi Band 2 స్పెసిఫికేషన్స్

Redmi Band 2 లో 1.47-ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, 172*320 పిక్సెల్ రెజుల్యూషన్, 247పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. 100 ప్రీ-లోడెడ్ వాచ్ ఫేసెస్ ఇందులో ఉన్నాయి. కొన్ని వాచ్ ఫేసెస్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి తమకు నచ్చిన ఇమేజ్ ని వాచ్ ఫేస్ గా పెట్టుకోవచ్చు.

Redmi Band 2 లో ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ సెన్సర్ ఉన్నాయి. రెగ్యులర్ ట్రాకింగ్ ఫీచర్స్ తో పాటు, స్లీప్, స్టెప్స్, ఫీమేల్ హెల్త్ వంటి ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. లేటెస్ట్ బడ్జెట్ ఫిట్నెస్ ట్రాకర్ లో యాక్సలరోమీటర్ ఔట్‌డోర్ రన్నింగ్, యోగా, హైకింగ్ వంటి వాటితో పాటు 30 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ని ట్రాక్ చేయగలదు.

Redmi Band 2 లో 210 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అయితే, హెవీ యూజర్స్ కి బ్యాటరీ లైఫ్ 6 రోజులు వస్తుంది. మాగ్నెటిక్ చార్జర్ ద్వారా చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఈ లేటెస్ట్ ఫిట్నెస్ ట్రాకర్ 5ATM రేటింగ్ తో వచ్చింది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టన్స్ కెపాసిటీ దీని సొంతం.

Redmi Band 2 టీపీయూ స్ట్రాప్స్ తో వచ్చింది. ఐవరీ, ఆలివ్, స్నేజీ గ్రీన్, బ్లూ, బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Band 2, 14.9 గ్రాములు బరువు ఉంటుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని ఈ బ్యాండ్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article2025 లో Burgman e-scooter ని భారత్‌లో లాంచ్ చేయనున్న Suzuki
Next articleSamsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.