రేపు లాంచ్ అవుతోన్న Redmi K50 Ultra

హైలైట్స్:

  • ఇంతకు ముందు ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గా చెప్పబడిన రెడ్మీ కే50 అల్ట్రా
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్న రెడ్మీ కే50 అల్ట్రా
  • 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఇందులో ఉండే అవకాశం

షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ తన రెడ్మీ కే50 సిరీస్ లైనప్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్మీ కే50 అల్ట్రా అనే పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకు ముందు ఈ ఫోన్ రెడ్మీ కే50 ఎక్స్‌ట్రిమ్ ఎడిషన్ గా వస్తుందని అనుకున్నారు. గురువారం నాడు, అంటే ఆగస్టు 11 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి.

Redmi K50 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, రెడ్మీ కే50 అల్ట్రా 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ప్లే తో వస్తున్నట్లు సమాచారం. ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్లో ఉంటాయని ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ చెప్పాడు. ఇతర ముఖ్యమైన ఫీచర్లను గురించి తెలుసుకుందాం పదండి.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ రెడ్మీ కే50 అల్ట్రా లో ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ 200ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు సమాచారం. అయితే, రీసెంట్ గా వచ్చిన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ని కలిగి ఉండనున్నట్లు తెలిసింది. 8ఎంపి అల్ట్రావైడ్ సెకండరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 20ఎంపి కెమెరా ఉండనుంది.

రెడ్మీ కే50 అల్ట్రా లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ కి ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

4జి చిప్సెట్స్ కొరత వేధిస్తుండటంతో, స్మార్ట్ ఫోన్ మేకర్స్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ వంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ లో యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పెరిగిపోతోంది. దీంతో సామాన్యుడిపై కాస్త భారం పడే అవకాశముంది. దేశంలో 5జీ సేవలు లాంచ్ అవ్వబోతున్న తరుణంలో 5జీ ఫోన్స్ కి డిమాండ్ కూడా పెరిగిపోతోంది. దీంతో కంపెనీలన్నీ అన్ని సెగ్మెంట్స్ లో 5జీ ఫోన్స్ ని లాంచ్ చేస్తున్నాయి. మీడియమ్ ప్రీమియం సెగ్మెంట్ లో షావోమీ కూడా రెడ్మీ కే50, పోకో ఎఫ్4 5జీ వంటి ఫోన్స్ ని లాంచ్ చేసింది.

అయితే, రెడ్మీ కే50 అల్ట్రా భారత మార్కెట్ కి వస్తుందా లేదా అనే విషయాన్ని షావోమీ ఇంకా ప్రకటించలేదు. ఆగస్టు 11 న జరగబోవు లాంచ్ ఈవెంట్ తర్వాత షావోమీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశముంది.

Previous article1000 పట్టణాలకు పూర్తైన Jio 5G రోలౌట్ ప్లాన్స్
Next articleFord India యొక్క సనంద్ ప్లాంట్ ని కొనేసిన Tata Motors
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.