హైలైట్స్:
- బ్యాంక్ ఆఫర్ ద్వారా Redmi K50i పై రూ.4000 డిస్కౌంట్
- క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ ద్వారా 6జిబి మరియు 8జిబి ర్యామ్ వేరియంట్స్ పై ఆఫర్
- వరుసగా రూ.21,999, రూ.24,999 గా ఉన్న Redmi K50i 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆఫర్ ధరలు
2019 తర్వాత భారత్ లో లాంచ్ అయిన తొలి కే-సిరీస్ ఫోన్ Redmi K50i. జులై లో లాంచ్ అయిన ఈ ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ ప్రారంభ ధర రూ.25,999 గా ఉంది. అయితే, Redmi K50i పై ప్రస్తుతం రూ.4000 డిస్కౌంట్ లభిస్తోంది. క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ డిస్కౌంట్ లభించనుంది. 8జిబి + 256జిబి వేరియంట్ పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు కనుక Redmi K50i ని కొనాలని భావిస్తుంటే, ఇదే మంచి సమయం. ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
Redmi K50i ఆఫర్, డిస్కౌంట్ ధర
Redmi K50i 6జిబి + 128జిబి లాంచ్ ధర రూ.25,999 కాగా, ఆఫర్ ప్రైస్ రూ.21,999 గా ఉంది. 8జిబి + 256జిబి లాంచ్ ధర రూ.28,999 ఉండగా, ఆఫర్ ద్వారా రూ.24,999 కి లభిస్తోంది.
ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా రిటైలర్ క్రోమా రూ.1000 డిస్కౌంట్ ని అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.3000 డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యూజర్లకు Redmi K50i కొనుగోలు పై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు Redmi K50i కొనుగోలు పై రూ.3000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
దీంతో, Redmi K50i ఫోన్ 6జిబి ర్యామ్ మోడల్ రూ.21,999 కే లభించనుంది. మరోవైపు 8జిబి ర్యామ్ వేరియంట్ రూ.24,999 కి లభిస్తోంది. Redmi K50i 5G ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్, ఫాంటమ్ బ్లూ.
Redmi K50i స్పెసిఫికేషన్స్
Redmi K50i 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్-స్టీరియో స్పీకర్, డాల్బి అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ Redmi K50i లో ఉన్నాయి.
Redmi K50i లో మిడ్-రేంజ్ ఫోన్ లో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది సమస్య కాదనుకునే వారు ఈ ఫోన్ ని ట్రై చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.













