హైలైట్స్:
- రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రో ఫోన్లను టీజ్ చేసిన రెడ్ మీ కంపెనీ
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో
- షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో రూపంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న కే50ఎస్, కే50ఎస్ ప్రో
గత ఫిబ్రవరి లో రెడ్ మీ కే50 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ రెడ్ మీ కే50, రెడ్ మీ కే50 ప్రో అనే రెండు మోడల్స్ కు విస్తరించింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత, కంపెనీ జనరల్ మేనేజర్, లూ వీబింగ్ చైనా సామాజిక మాధ్యమం విబో ద్వారా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేశాడు. ఇది రెడ్ మీ కే50ఎస్ సిరీస్ అని మేం అంచనా వేస్తున్నాం. ఈ సిరీస్ లో రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రొ భాగమవ్వనున్నాయి. రెడ్ మీ ఫ్లాగ్ షిప్ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ను కలిగి ఉండనుందని లూ వీబింగ్ తెలిపాడు.
అయితే లూ వీబింగ్ లాంచ్ సమయాన్ని చెప్పలేదు. ఆగస్టు నెలలో చైనాలో లాంచ్ చేసి, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లో విడుదల చేస్తారని మేం విశ్వసిస్తున్నాం.
అఫీషియల్ గా టీజ్ చేయబడిన Redmi K50S లాంచ్
రెడ్ మీ జనరల్ మేనేజర్ లూ వీబింగ్ అఫీషియల్ గా రెడ్ మీ కే-సిరీస్ ఫోన్స్ ని సామాజిక మాధ్యమం వీబో లో టీజ్ చేశాడు. అయితే అతడు ఫోన్ పేరేంటో తెలపలేదు. రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రో అని మేం అంచనా వేస్తున్నాం. కే50ఎస్ ప్రో 3సీ సర్టిఫికేషన్ డేటాబేస్ పై 22081212సీ అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. లిస్టింగ్ ని బట్టి, ఈ డివైజ్ 120 వాట్ హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని అర్థమవుతోంది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం.
మోటో ఎడ్జ్ 30 అల్ట్రా కంటే ముందు లాంచ్ అయితే కనుక, 200ఎంపి కెమెరా సెటప్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా రెడ్ మీ కే50ఎస్ ప్రొ నిలవనుంది. అలాగే ఈ ఫోన్ 120 హెర్ట్జ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 256జిబి స్టోరేజీ, 5జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. రెడ్ మీ కే50ఎస్ ‘diting’ అనే కోడ్ నేమ్ ని కలిగి ఉందని గతంలో షావోమీయూఐ అనే వెబ్ సైట్ తెలిపింది. ఇక కే50ఎస్ కోడ్ నంబర్ 22071212ఏసీ అని ఉంది. ఇక రెడ్ మీ కే50ఎస్ ప్రో ‘Plato’ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇక రెడ్ మీ కే50ఎస్, రెడ్ మీ కే50ఎస్ ప్రొ ఫోన్స్.. షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో అనే మోడల్స్ గా గ్లోబల్ మార్కెట్స్ లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడే దీనిపై కచ్చితంగా ఏమీ చెప్పలేం.