Home News భారత్‌లో రూ.30 వేలకు పైనే ఉండనున్న Redmi K60 సిరీస్ ఫోన్ల ధర

భారత్‌లో రూ.30 వేలకు పైనే ఉండనున్న Redmi K60 సిరీస్ ఫోన్ల ధర

హైలైట్స్

2022 డిసెంబర్ నెలలో చైనాలో Redmi K60 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి రెడ్మీ లవర్స్ ఈ సిరీస్ యొక్క ఇండియా లాంచ్ గురించి వేచి చూస్తున్నారు. అయితే తాజాగా రెడ్మీ నోట్ 12 సిరీస్ ని షావోమి భారత్ లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు Redmi K60 సిరీస్ తో షావోమి మరోసారి భారతీయ రెడ్మీ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతోంది.

రెడ్మీ బ్రాండ్ పై వచ్చే ఫోన్లలో కే-సిరీస్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. ఇప్పుడు Redmi K60 సిరీస్ కి సంబంధించి కూడా ఇటువంటి వార్తే ఒకటి బయటకు వచ్చింది. త్వరలో భారత్ లో లాంచ్ కాబోయే Redmi K60 సిరీస్ ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే ఉంటుందని సమాచారం. సరే ఓసారి Redmi K60 సిరీస్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ పై లుక్ వేద్దాం పదండి.

Redmi K60 సిరీస్ స్పెసిఫికేషన్స్

Redmi K60 సిరీస్ లో మొత్తం మూడు ఫోన్లు ఉంటాయి. అవి: Redmi K60, Redmi K60 Pro, Redmi K60e. వీటిలో టాప్ వేరియంట్ అయిన Redmi K60 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ ని ఇందులో అందించారు.

Redmi K60 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. Redmi K60 Pro లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Redmi K60 5జీ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్, 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.

Redmi K60e లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2k రెజుల్యూషన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.