Redmi K60 సిరీస్ లాంచ్ అప్డేట్; టాప్ ఎండ్ చిప్సెట్స్‌తో వచ్చే అవకాశం

హైలైట్స్

  • ఈ నెలాఖరులో లాంచ్ కానున్న Redmi K60 సిరీస్
  • లైనప్ లో రానున్న మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E
  • వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్, అమోలెడ్ డిస్ప్లే, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, 64ఎంపి కెమెరాతో రానున్న Redmi K60 సిరీస్

చైనా సామాజిక మాధ్యమం వీబో పై ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi K60 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని పోస్ట్ చేశాడు. అతడి ప్రకారం, ఈ నెలలోనే చైనాలో Redmi K60 సిరీస్ కి చెందిన 3 మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. ఆ మోడల్స్: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E. ఈ ఫోన్లు పెర్ఫామెన్స్ లో కింగ్స్ అని టిప్‌స్టర్ తెలిపాడు. అంటే బహుశా ఈ ఫోన్లు టాప్‌-ఎండ్ మీడియాటెక్ లేదా స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలె ఈ ఫోన్స్ కి సంబంధించిన మరొక లీక్ జనవరిలో లాంచ్ ఉంటుందని తెలిపింది.

Redmi K60 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానుంది. అయితే భారత్ లో మాత్రం POCO బ్రాండ్ తో లాంచ్ అవ్వనుంది. రీసెంట్ గా బయటకు వచ్చిన లీక్ ద్వారా డిస్ప్లే సైజ్, చిప్సెట్ ఇంకా మరెన్నో వివరాలు తెలిసాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K60 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

సొక్రటీస్, మాండ్రియన్, రెంబ్రాండ్ట్ అనే మూడు కోడ్ నేమ్స్ ని Redmi K60, Redmi K60 Pro, Redmi K60E డివైజెస్ కలిగి ఉన్నాయి. Redmi K60 ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే Redmi K60 Pro ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుందని తెలుస్తోంది. అయితే ఇది లాజికల్ గా అనిపించడం లేదు. ఎందుకంటే ప్రో వర్షన్ బేస్ మోడల్ కంటే కాస్త తక్కువ శ్రేని చిప్సెట్ తో రానుండటం విచిత్రమే. ఇందులో ఏదో విషయం దాగి ఉంది. అందేంటో త్వరలోనే స్పష్టత రానుంది.

Redmi K60E ఫోన్ మీడియటెక్ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాసెసర్ పేరేంటో ఇంకా తెలియదు. డైమెన్సిటీ 8200 చిప్ అని అంచనా వేస్తున్నారు. Redmi K60 స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం ఈ ఫోన్ లో ఉంటుంది.

Redmi K60 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మరోవైపు Redmi K60 Pro డివైజ్ 2కే 120 హెర్ట్జ్ డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ సామర్థ్యంతో వస్తున్నట్లు సమాచారం.

ఈ నెలాఖరు వరకు చైనాలో Redmi K60 సిరీస్ లాంచ్ కానుంది. అంటే మరొక రెండు రోజుల్లో కంపెనీ నుంచి కచ్చితమైన అప్డేట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.