హైలైట్స్:
- డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Redmi K60 సిరీస్
- 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్స్ లో రానున్న Redmi K60 సిరీస్
- Redmi K60 సిరీస్ 2023 లో లాంచ్ అయ్యే అవకాశం
Redmi K-series బడ్జెట్ ఫ్లాగ్షిప్ లైనప్ గా పరిగణించబడుతోంది. షావోమీ సిరీస్ ఫోన్లకు ప్రత్యామ్నాయ ఆప్షన్ గా ఈ కే-సిరీస్ నిలుస్తోంది. రెడ్మీ కే-సిరీస్ లో ఇన్నాళ్ళు వైర్లెస్ చార్జింగ్, ఐపీ రేటింగ్ వంటివి మిస్ అవుతూ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు రెడ్మీ సిరీస్ కి ప్రీమియమ్ ఫీచర్లు వచ్చేశాయి. ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రెడ్మీ కే-60 సిరీస్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసింది.
ఐఫోన్ 14 సిరీస్ లో వచ్చిన ఆకట్టుకునే ఫీచర్ డైనమిక్ ఐల్యాండ్. ఇప్పటికే ఈ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఇన్-బిల్ట్ గా అందుబాటులోకి రాబోతుంది. రెడ్మీ కే60 సిరీస్ లో ఈ డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. Redmi K60 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్, 67 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుంది. అయితే 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో రానుందని మరొక రూమర్ వినిపిస్తోంది.
Redmi లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్?
ఐఫోన్ 14 సిరీస్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ని పరిచయం చేశారు. ఇటీవలి కాలంలో ఎంతో హైప్ పొందిన ఫీచర్ ఇదే. కొత్త డిజైన్ తో పాటు, దీనికి ప్రత్యేక ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు ఈ ఫీచర్ ని తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో రెడ్మీ కూడా ఒకటి. కంటెంట్, టెక్ట్స్ ని బట్టి ఈ డైనమిక్ ఐల్యాండ్ తన సైజ్ ని మార్చుకుంటూ ఉంటుంది. Redmi K60 సిరీస్ లో డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో రాబోవు Redmi K60 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ తో పాటు 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. అలాగే ఈ ఫోన్ రెడ్మీ కే60 లైనప్ లోనిదే అన్న విషయం కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తొలిసారిగా రెడ్మీ కే-సిరీస్ లో వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ వస్తోంది. అయితే 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ పెద్ద విషయమేమీ కాదని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కచ్చితమైన మోడల్ పేర్లు ఇంకా బయటకు రాలేదు.
Redmi K60 సిరీస్ హై-ఎండ్ మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుందని సమాచారం. ఈ చిప్ 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో పోల్చితే 8 జెన్ 2 మెరుగైన పనితీరుని కనబరుస్తుందని తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.