హైలైట్స్
- ఇటీవలె చైనాలో లాంచైన Redmi K60 5G డివైజ్
- భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60 5G
- 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైన Redmi K60 5G
రీసెంట్ గా చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi K60 5G, Redmi K60 Pro, Redmi K60e. అయితే తాజాగా వచ్చిన సమాచారాన్ని బట్టి, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ చైనాకు బయట, అంటే గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
గతంలో కూడా షావోమి తన రెడ్మీ బ్రాండ్ డివైజెస్ ని పోకో బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసిన సందర్భాలున్నాయి. Redmi K50 Gaming ఫోన్ ని కొన్ని ఇతర మార్కెట్స్ లో POCO F4 GT అనే పేరుతో లాంచ్ చేసింది. ఇక భారత్ లో POCO F4 గా లాంచైన ఫోన్ ఇతర మార్కెట్స్ లో Redmi K40s అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది.
ఇకపోతే భారత్ లో Redmi K50i కి సక్సెసర్ గా Redmi K60e లాంచ్ అవ్వనుందని సమాచారం. అయితే Redmi K60e కేవలం చైనాకు మాత్రమే పరిమితమని ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించాడు. ఇక విషయంలోకి వస్తే, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ POCO F5 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. మిగతా Redmi K60 సిరీస్ ఫోన్లకు సంబంధించి ఇంకా ఏ విషయం తెలియలేదు. అవి కూడా రీబ్రాండ్ అవుతాయా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.
షావోమి ఇప్పటికైతే ఏ విషయం కూడా ఖరారు చేయలేదు. ఒకవేళ Redmi K60 5G గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ అయినప్పటికీ, ఆ డివైజ్ భారత్ కి వస్తుందా లేదా అన్నది కూడా కచ్చితంగా చెప్పలేం. అంతా షావోమి చేతిలో ఉంటుంది. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ఈలోపు ఓసారి Redmi K60 5G యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.
Redmi K60 5G స్పెసిఫికేషన్స్
Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.