షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. అయితే బ్రాండ్ నుంచి ప్రకటన రాకముందే, Redmi K70 Pro యొక్క డిజైన్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్
- ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సామాజిక మాధ్యమం వీబో పై Redmi K70 Pro కి సంబంధించిన డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది.
- లీక్ ప్రకారం, Redmi K70 Pro డివైజ్ ఫ్లాట్ 2కే రెజుల్యూషన్ డిస్ప్లేతో రానున్నట్లు సమాచారం.
- Redmi K70 Pro మొబైల్ స్క్రీన్ సన్నని బెజెల్స్, హై స్క్రీన్-టు-బాడీ రేషియో, బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
- Redmi K70 Pro డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, గ్లాస్ బాడీతో వస్తోంది.
Redmi K70 Pro లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
Redmi K70 సిరీస్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e మోడల్స్ తొలుత చైనాలో లాంచ్ కానున్నాయి. డిసెంబర్ నెలలో ఈ డివైజెస్ లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ గా ఈ ఫోన్లు POCO బ్రాండింగ్ తో లాంచ్ కానున్నాయి. అయితే బ్రాండ్ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన మరింత సమాాచారం లీక్స్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది.
Redmi K70 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Redmi K70 సిరీస్ మొబైల్స్ 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నాయి.
- ప్రాసెసర్: Redmi K70 ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ప్రో వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉండవచ్చు. ఇకపోతే, Redmi K70e లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉంటుందని అంచనా.
- బ్యాటరీ: Redmi K70 సిరీస్ ఫోన్లలో 5,120ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. టాప్ వేరియంట్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. మిగతా మోడల్స్ 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
- కెమెరా: Redmi K70 సిరీస్ డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. అయితే అన్నింట్లోనూ టెలీఫోటో లెన్స్ ఉంటుందని సమాచారం.
- సాఫ్ట్వేర్: Redmi K70 సిరీస్ డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- ఇతర ఫీచర్లు: Redmi K70 సిరీస్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
