ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి సబ్-బ్రాండ్ అయి రెడ్మీ త్వరలోనే Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70 E అనే మూడు మోడల్స్ రానున్నాయి. అయితే లాంచ్ కి ముందు Redmi K70 స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Redmi K70 సిరీస్ డిజైన్
గతంలో వచ్చిన Redmi K60 సిరీస్ కి సక్సెసర్ గా Redmi K70 సిరీస్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. ఈ సిరీస్ డిజైన్ గత మోడల్ మాదిరే ఉండనుంది. డివైజ్ లెదర్-టెక్షర్డ్ ప్యానెల్ తో రానుందని సమాచారం. టెలీఫోటో లెన్స్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ Redmi K70 ని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.
Redmi K70 లాంచ్ టైమ్‌లైన్ (లీక్డ్)
Redmi K70 సిరీస్ కి సంబంధించిన కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, Redmi K70 సిరీస్ డివైజెస్ తొలుత చైనాలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తర్వాత భారతీయ మార్కెట్ లోకి POCO బ్రాండింగ్ తో రానుంది. లాంచింగ్ గురించి మాట్లాడితే, కొన్ని రోజుల్లోనే ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం.
Redmi K70 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Redmi K70 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తాయని సమాచారం.
- ప్రాసెసర్: Redmi K70 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, Redmi K70 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, Redmi K70e మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంటాయని తెలుస్తోంది.
- బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5120 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండవచ్చు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని సమాచారం.
- కెమెరా: Redmi K70 లో టెలీఫోటో లెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా బయటకు రాలేదు.
- ఓఎస్: Redmi K70 డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
