ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K80 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇంకా దీనికి సంబంధించి లాంచ్ ప్రకటన రావాల్సి ఉంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది.
Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
Redmi K80 Pro డివైజ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.
లీక్ ప్రకారం, Redmi K80 Pro డివైజ్ 3ఎక్స్ టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
Redmi K80 Pro లో 2కే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ తన పోస్ట్ ద్వారా తెలిపారు.
ఇంకా Redmi K80 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
Redmi K80 Pro లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని గతంలో ఓ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ వివరాలు తప్పా ఇంకా ఏవీ అందుబాటులో లేవు.
Redmi K80 స్పెసిఫికేషన్స్ (లీక్)
లీకైన వివరాల ప్రకారం, Redmi K80 ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
Redmi K80 Pro లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
Redmi K80 Pro డివైజ్ లో గత మోడల్ Redmi K70 Pro మాదిరి ఒక టెలీఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది.
Redmi K80 సిరీస్ లోని రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్‌ని గ్లాస్ మెటీరియల్ తో ఇవ్వనున్నారని సమాచారం.
