Home News Redmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్

Redmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో రానున్న కే80, కే80 ప్రో
  • లీకైన Redmi K80 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో K80 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తొలుత Redmi K80 సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈలోపే Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్‌ని మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.

డివైజెస్ యొక్క పేర్లను రివీల్ చేయకుండానే టిప్‌స్టర్ కే80 సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది.

చైనాలో Redmi K80 Pro డివైజ్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

Redmi K80 Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఈ డివైజ్ లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ర్యామ్, స్టోరేజీ మరియు కెమెరా వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

Redmi K80 స్పెసిఫికేషన్స్ (లీక్)

లీకైన వివరాల ప్రకారం, Redmi K80 ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Redmi K80 Pro లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Redmi K80 Pro డివైజ్ లో గత మోడల్ Redmi K70 Pro మాదిరి ఒక టెలీఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Redmi K80 సిరీస్ లోని రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్‌ని గ్లాస్ మెటీరియల్ తో ఇవ్వనున్నారని సమాచారం.