Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi K80, Redmi K80 Pro పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. ఓసారి లీకైన ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.
Redmi K80, Redmi K80 Pro వివరాలు (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు Redmi K80 సిరీస్ యొక్క సమాచారాన్ని చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేశారు.
Redmi K80 సిరీస్ 2024 నవంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్ ద్వారా తెలుస్తోంది.
ఇంకా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తోందని టిప్‌స్టర్ తెలిపారు.
Redmi K80 సిరీస్ గ్లాసీ మెటీరియల్, కంపోజిట్ గ్లాస్ కలిగి సిరామిక్ టచ్ తో వస్తోందని సమాచారం.
డిజైన్ విషయానికి వస్తే, ఈసారి కంపెనీ కెమెరా మాడ్యూల్‌ని టాప్ లెఫ్ట్ కార్నర్ కి షిప్ట్ చేస్తుందని తెలుస్తోంది.
ఐఎంఈఐ లిస్టింగ్ పై Redmi K80 ఫోన్ 24122RKC7C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Redmi K80 Pro డివైజ్ 24127RK2CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Redmi K80, Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
Redmi K80 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.
ఇంకా డిస్ప్లే సైజ్ రివీల్ కాలేదు. కానీ, ఓ కథనం ప్రకారం, Redmi K80 Pro డివైజ్ 2కే డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది.
Redmi K80 Pro లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందని రివీల్ అయ్యింది.
Redmi K80 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ టెలీఫోటో ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి.
Redmi K80 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
Redmi K80 ఫోన్ యొక్క చిప్సెట్ వివరాలు, ఇతర సమాచారం ఇంకా బయటకు రాలేదు.
