హైలైట్స్:
- చైనాలో లాంచ్ అయిన Redmi Note 11R
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ తో వస్తున్న హ్యాండ్సెట్
- Poco M4 5G ని రీబ్రాండ్ చేసి Redmi Note 11R పేరుతో చైనాలో వదిలిన షావోమీ
Xiaomi కంపెనీ రెడ్మీ నోట్ 11 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేసింది. చైనాలో Redmi Note 11R ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది భారత్ లో లాంచ్ అయిన పోకో ఎమ్4 5జీ ఫోన్ కి రీబ్రాండ్ వర్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi Note 11R స్పెసిఫికేషన్స్ దాదాపు పోకో ఎమ్4 5జీ మాదిరే ఉన్నాయి.
Redmi Note 11R ధర, లభ్యత
Redmi Note 11R 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ CNY 1,299 (దాదాపు రూ.14,800) ధరతో చైనాలో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర CNY 1,499 (దాదాపు రూ.17,200) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,699 (రూ.19,500) గా నిర్ణయించారు.
బ్లాక్, గ్రేట్, బ్లూ కలర్ వేరియంట్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతానికి Redmi Note 11R ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. మిగతా దేశాల్లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు. ఇక భారత్ లో ఇప్పటికే పోకో ఎమ్4 5జీ ఫోన్ ఉండటం వల్లన, Redmi Note 11R లాంచ్ అయ్యే అవకాశం లేదు.
Redmi Note 11R స్పెసిఫికేషన్స్
Redmi Note 11R లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది.
Redmi Note 11R డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Redmi Note 11R లో 5ఎంపి కెమెరా ఉంది. Redmi Note 11R లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
Redmi Note 11R లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. Redmi Note 11R 163.99 మిల్లీ మీటర్ల పొడవు, 76.09 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ బరువు 201 గ్రాములు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.