Home News చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Redmi Note 11R ధర, స్పెసిఫికేషన్స్

చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయిన Redmi Note 11R ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

Redmi Note 11 సిరీస్ లో ఇప్పటికే పలు మోడళ్ళు మార్కెట్ లో ఉన్నాయి. అవి: రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో+, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11ఎస్, రెడ్మీ నోట్ 11 ఎస్ఈ. అయితే, త్వరలో ఈ బ్రాండ్ నుంచి Redmi Note 11R అనే ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ విషయం చైనా టెలీకామ్ వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇకపోతే ఈ ఫోన్ 22095RA98C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న C అనే అక్షరం చైనా వర్షన్ ని సూచిస్తుంది.

చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో కనిపించిన మోడల్, Redmi Note 11R అని అంచనా వేస్తున్నారు. ఇదివరకు ఈ ఫోన్ Redmi 11A అనే పేరుతో లాంచ్ అవుతుందని అనుకున్నారు. ఇక Redmi Note 11R భారత ఎంట్రీ పై అప్పుడే ఏ విషయం కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ లాంచ్ అయితే కనుక, రీబ్రాండ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi Note 11R ధర (లీక్డ్)

Redmi Note 11R చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో 22095RA98C అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ మొత్తం 3 వర్షన్స్ లో లభించనుందని అర్థమవుతోంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఫోన్ ధర RMB 1299 (దాదాపు రూ.14,800) గా లిస్ట్ కాబడింది. అయితే అఫీషియల్ ప్రైస్ వేరేగా ఉండవచ్చు.

Redmi Note 11R స్పెసిఫికేషన్స్

Redmi Note 11R 6.58-ఇంచ్ డిస్ప్లే తో వస్తున్నట్లు సమాచారం. రెండర్ ఇమేజ్ ని బట్టి, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. భారీ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇటువంటి కెమెరా ఐల్యాండ్ ని మనం పోకో ఫోన్లలో చూశాం. ఇకపోతే రియర్ కెమెరాల్లో 13ఎంపి మెయిన్ సెన్సర్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి కెమెరా ఉండనుంది.

Redmi Note 11R ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ని చూస్తే, ఇదొక బడ్జెట్ 4జీ ఫోన్ అని తెలుస్తోంది. ఫోన్ ఏ చిప్ తో వస్తుందో ఇంకా తెలియలేదు. తొలుత చైనాలో లాంచ్ అయి తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి Redmi Note 11R ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.