హైలైట్స్:
- ఆగస్టు 26 న భారత్ లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 11ఎస్ఈ
- మీడియాటెక్ హీలియో 695 చిప్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- ఆగస్టు 31 నుంచి ఫ్లిప్ కార్ట్, షావోమీ అధికార వెబ్ సైట్ ద్వారా విక్రయానికి రానున్న రెడ్మీ నోట్ 11ఎస్ఈ
రెడ్మీ నోట్ 11ఎస్ఈ ఆగస్టు 26 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. రెడ్మీ నోట్ 10ఎస్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా రెడ్మీ నోట్ 11ఎస్ఈ వస్తోంది. ఇప్పటికే రెడ్మీ నోట్ 10ఎస్ భారత్ లో అందుబాటులో ఉంది. షావోమీ అధికార వెబ్ సైట్ లో రెడ్మీ నోట్ 11ఎస్ఈ కి సంబంధించిన ఒక మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఆప్షన్స్, డిజైన్, ఫ్లిప్ కార్ట్ లభ్యత, విక్రయ తేదీ వంటి వివరాలు తెలిశాయి.
ఇక బాక్స్ కంటెంట్ చూస్తే, యూఎస్బీ టైప్-సీ కేబుల్, సిమ్ ఎజెక్ట్ టూల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్, వ్యారంటీ కార్డ్, డివైజ్ వంటివి రిటైల్ ప్యాకేజ్ లో ఉన్నాయి. అంటే మీరు రెడ్మీ 11ఎస్ఈ ని చార్జర్ లేకుండా కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, రెడ్మీ నోట్ 10ఎస్ ఫోన్ ని చార్జర్ లేకుండా కొనుక్కోవడం అన్నమాట. ఎందుకంటే నోట్ 10ఎస్ కి 11ఎస్ఈ రీబ్రాండెడ్ వర్షన్ కాబట్టి అలా అనుకోక తప్పదు.
Redmi Note 11SE విక్రయ తేదీ, ఫ్లిప్ కార్ట్ లభ్యత
రెడ్మీ నోట్ 11ఎస్ఈ నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: థండర్ పర్పుల్, కాస్మిక్ వైట్, షాడో బ్లాక్, బైఫ్రాస్ట్ బ్లూ. ఆసక్తి గల బయ్యర్లు 6జిబి + 64జిబి, 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్లలో ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ నోట్ 11ఎస్ఈ ఆగస్టు 31 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు షావోమీ అధికార వెబ్ సైట్ ద్వారా సేల్ కి వస్తోంది.
Redmi Note 11SE స్పెసిఫికేషన్స్
రెడ్మీ నోట్ 11ఎస్ఈ లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 409పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ హీలియో 695 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో వెనుక వైపు నాలుగు కెమెరాలను అమర్చారు. అందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎంఐయూఐ 12.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ ఐపీ53 వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ని కలిగి ఉంది. రెడ్మీ నోట్ 11ఎస్ఈ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. భద్రత కొరకు, ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. అలాగే ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.