Home News మీడియాటెక్ హీలియో జీ95, 64ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Redmi Note 11SE

మీడియాటెక్ హీలియో జీ95, 64ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Redmi Note 11SE

హైలైట్స్:

Redmi Note 11SE భారత్ లో అధికారికంగా లాంచ్ అయ్యింది. రెడ్మీ నోట్ 10ఎస్ యొక్క రీబ్యాడ్జ్ వర్షన్ ఈ రెడ్మీ నోట్ 11ఎస్ఈ. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, క్వాడ్ కెమెరా సెన్సర్స్ కోసం రెక్టాంగ్యులర్ లేఔట్, సౌడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. మల్టీ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. ఇక్కడ జనాలను గందరగోళానికి గురి చేసే విషయం ఏంటంటే, ఇప్పటికే ఉన్న మోడల్ కి వేరే మార్కెటింగ్ పేరుతో ఎందుకు రిలీజ్ చేసిందని.

Redmi Note 11SE లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ95 చిప్సెట్, 4జీ ఎల్టీఈ, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

భారత్ లో Redmi Note 11SE ధర, విక్రయ తేదీ

Redmi Note 11SE యొక్క 6జిబి ర్యామ్ 64జిబి వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్ వైట్, బ్లాక్, థండర్ పర్పుల్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 11SE స్పెసిఫికేషన్స్

Redmi Note 11SE లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్నెస్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, లో-బ్లూ లైట్ సీజీఎస్ సర్టిఫికేషన్, మీడియాటెక్ హీలియో జీ95 చిప్సెట్, ఏఆర్ఎం మాలి-జీ76 ఎంసీ4, 6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi Note 11SE లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 13ఎంపి కెమెరాను అమర్చారు.

Redmi Note 11SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 4జీ ఎల్టీఈ, వోల్టీ, వాయిస్ ఓవర్ వైఫై, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఏసీ, బ్లూటూత్ వర్షన్ 5.0, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్టీరియో స్పీకర్స్, ఐపీ53 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.