అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 4G

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 685 4జీ చిప్సెట్ పై పని చేయనున్న Redmi Note 12 4G

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4జీ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. 4జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదొక మంచి ఆప్షన్ గా నిలవనుంది. స్నాడప్ డ్రాగన్ 685 చిప్సెట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ లో అందించారు. 11జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi Note 12 4G ధర, కలర్ ఆప్షన్స్

భారత్ లో Redmi Note 12 4G సన్ రైజ్ గోల్డ్, లునార్ బ్లాక్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. రెడ్మీ నోట్ 11 తో పోల్చితే Redmi Note 12 4G డివైజ్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. స్లీక్ డిజైన్ యూజర్లను ఇట్టే ఆకట్టుకోనుంది. ఈ డివైజ్ కేవలం 7.8 ఎంఎం మందం, 186 గ్రాముల బరువు కలిగి ఉంది.

Redmi Note 12 4G డివైజ్ 6జిబి/64జిబి వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 6జిబి/128జిబి మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఏప్రిల్ 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఎంఐ వెబ్ సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. షావోమి ఫ్యాన్స్ తమ పాత ఫోన్లను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్
  • 11జిబి వర్చువల్ ర్యామ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

Redmi Note 12 4G డివైజ్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 సపోర్ట్ తో వచ్చింది. Redmi Note 12 4G లో స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. ఇది 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 11జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

Redmi Note 12 4G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది. ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వచ్చింది.

పవర్ బ్యాకప్ కోసం Redmi Note 12 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.