భారత్ లో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసిన షావోమి ఇప్పుడు ఈ సిరీస్ లో ఒక 4జీ వేరియంట్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే Redmi Note 12 4G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుంది. రూమర్లను బట్టి, ఈ డివైజ్ రానున్న కొన్ని నెలల్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో దర్శనమిచ్చింది. టిప్‌స్టర్ SnoopyTech తాజాగా ఒక కొత్త సమాచారంతో వచ్చాడు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Redmi Note 12 4G లాంచ్ వివరాలు, స్టోరేజీ, కలర్ వేరియంట్స్
Redmi Note 12 4G డివైజ్ రానున్న కొన్ని వారాల్లో గ్లోబల్ గా లాంచ్ కానుందని టిప్‌స్టర్ వెల్లడించాడు. అయితే Redmi Note 12 4G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియదు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభించనుంది. మింట్ గ్రీన్, ఆనిక్స్ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుందని అంచనా వేస్తున్నారు.
Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా తో రానుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ను వాడనున్నారు. చిప్సెట్ వివరాలు ఇంకా తెలియదు. ఇక బ్యాటరీ విభాగం చూస్తే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. ఐపీ53 రేటింగ్, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ ఫోన్ రానున్నట్లు టిప్‌స్టర్ చెబుతున్నాడు.
రిపోర్ట్ ప్రకారం, Redmi Note 12 4G డివైజ్ NBTC, TDRA, FCC, IMDA సర్టిఫికేషన్స్ ని పొందినట్లు తెలుస్తోంది. FCC లిస్టింగ్ ప్రకారం, Redmi Note 12 4G స్మార్ట్ ఫోన్ ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వర్షన్ వివరాలు తెలుస్తాయి. Redmi Note 10 Pro కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా Redmi Note 12 4G వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
