హైలైట్స్
- Redmi Note 12 5G ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసిన రెడ్మీ సంస్థ
- ప్రో-మోడల్స్ Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G లతో పాటు లాంచ్ కానున్న Redmi Note 12 5G
- అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి రానున్న Redmi Note 12 5G, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న ప్రో-మోడల్స్
Redmi రీసెంట్ గా Redmi Note 12 Pro సిరీస్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. 2023 జనవరి 5 న Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఫోన్స్ భారత్ లో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్నాయి. అయితే ఆ సమయంలో Redmi Note 12 5G గురించి ఏమీ చెప్పలేదు. ఎట్టకేలకు రెడ్మీ సంస్థ Redmi Note 12 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించడంతో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించబడుతుందని తెలిపింది.
అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Redmi Note 12 5G
Redmi Note 12 5G భారత్ లో కూడా లాంచ్ అవుతుందని రెడ్మీ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెజాన్ ఇండియాలో ల్యాండింగ్ పేజీ కూడా కనిపిస్తోంది. దీంతో ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ తదితర విషయాలు బయటకు వచ్చాయి. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, 5జీ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్ (చైనీస్ వేరియంట్)
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.
Redmi Note 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
Redmi Note 12 5G ధరలు (చైనీస్ వేరియంట్)
Redmi Note 12 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను RMB 1199 (సుమారు రూ.13,600) గా నిర్ణయించారు. 6జిబి/128జిబి వేరియంట్ ధర RMB 1299 (సుమారు రూ.14,800) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర RMB 1499 (సుమారు రూ.17,000) గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1699 (సుమారు రూ.19,300) గా నిర్ణయించారు. భారత్ లో లాంచ్ అయ్యాక ధరల్లో మార్పు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












