హైలైట్స్
- జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 5G
- 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Redmi Note 12 5G
- Redmi Note 12 5G లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడినట్లు కన్ఫర్మ్ చేసిన రెడ్మీ కంపెనీ
భారతీయ మార్కెట్ లో Redmi Note 12 5G సిరీస్ ని లాంచ్ చేసేందుకు షావోమి సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్లు వస్తున్నాయి. జనవరి 5 న ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ మూడు ఫోన్లు 5జీ కనెక్టివిటీతో వస్తున్నాయి. Redmi Note 12 5G అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G డివైజెస్ మాత్రం ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తున్నాయి.
తాజాగా లాంచ్ కి ముందు అమెజాన్ లో మైక్రో-సైట్ ద్వారా Redmi Note 12 5G యొక్క ప్రాసెసర్ కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ టీజర్ ద్వారా తెలిసిందేంటంటే, Redmi Note 12 5G చైనీస్ వేరియంట్ మాదిరే ఇండియన్ వేరియంట్ కూడా ఉంటుందని స్పష్టమైంది. సరే ఓసారి Redmi Note 12 5G యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం.
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Redmi Note 12 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. భారత్ లో ఈ ఫోన్ ధర వేరియంట్ ని బట్టి, రూ.14,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాతే ధరల వివరాలు కచ్చితంగా తెలుస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.