హైలైట్స్
- Redmi Note 12 5G లాంచ్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన రెడ్మీ కంపెనీ
- అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G సిరీస్
- లైనప్ మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
- ఇంకా వెల్లడికావాల్సిన Redmi Note 12 5G లాంచ్ తేదీ
Redmi Note 12 5G సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా రెడ్మీ కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. అసలైతే ఈ ఫోన్స్ చైనాలో అక్టోబర్ నెలలో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో ఉన్న మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. అయితే ఈ మోడల్స్ అన్నీ భారత్ లో అడుగుపెట్టే అవకాశం లేదు. పేరెంట్ కంపెనీ అయిన షావోమీ కూడా ఏయే మోడల్స్ భారత్ కు వస్తున్నాయో తెలపలేదు.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, Redmi Note 12 Pro+ ఇండియా వేరియంట్ 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తుందని తెలుస్తోంది.
Redmi Note 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఇంకా తెలియదు. అయితే షావొమీ వెబ్ సైట్ లో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ మాత్రం దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ 2022 చివర్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
The legacy is about to get 12 ????? ??????, ??????, ??? ????? amazing with the most noteworthy phone of the year. ♥️
The #RedmiNote12 5G series is not just a note it's the #SuperNote. ?
Get Notified: https://t.co/bSN7VljgxA pic.twitter.com/xDCmTKZwgU
— Redmi India (@RedmiIndia) December 7, 2022
Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Redmi Note 12 Pro, Note 12 Pro+ స్పెసిఫికేషన్స్
Redmi Note 12 Pro, Note 12 Pro+ ఫోన్లు 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి.
Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. మరోవైపు Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Note 12 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Redmi Note 12 Pro+ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












