హైలైట్స్
- చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 Explorer Edition
- ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ తో పాటు లాంచ్ అయిన Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Note 12 Pro+
- 200ఎంపి శాంసంగ్ సెన్సర్, 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వచ్చిన Redmi Note 12 Explorer Edition

Redmi కంపెనీ తాజాగా Redmi Note 12 సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ లైనప్ లో Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 Explorer Edition ఉన్నాయి. ప్రస్తుతం మనం Redmi Note 12 Explorer Edition గురించి తెలుసుకుందాం. ఈ లైనప్ లో కెల్లా అత్యంత శక్తివంతమైన ఫోన్ గా Redmi Note 12 Explorer Edition నిలుస్తోంది.
Redmi Note 12 Explorer Edition డిస్ప్లే
Redmi Note 12 Explorer Edition లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. ఈ డిస్ప్లే ఓఎల్ఈడీ ప్యానెల్ తో తయారైంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఇందులో 900 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Redmi Note 12 Explorer Edition కెమెరా
Redmi Note 12 Explorer Edition కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఫోన్ లో కెమెరానే హైలైట్ పాయింట్. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 200 మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్పీఎక్స్ భారీ సెన్సర్ ఉంది. దీంతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇకపోతే 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు.
Redmi Note 12 Explorer Edition ప్రాసెసర్
Redmi Note 12 Explorer Edition మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వచ్చింది. ఇదొక ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ రెడ్మీ ఫోన్ 5జీ మరియు 4జీ నెట్వర్క్స్ పై పని చేస్తుంది. Redmi Note 12 Explorer Edition 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని కలిగి ఉంది.
210W ఫాస్ట్ చార్జింగ్
Redmi Note 12 Explorer Edition లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించడం అద్భుతమైన విషయం. ఈ 210 వాట్ చార్జర్ తో ఫోన్ ని కేవలం 9 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయవచ్చు.
Redmi Note 12 Explorer Edition ధర
Redmi Note 12 Explorer Edition కేవలం ఒకే వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర 2399 యువాన్లు (సుమారు రూ.27,200) గా ఉంది. Redmi Note 12 Explorer Edition బ్లాక్ కలర్ ఆప్షన్ తో చైనాలో లాంచ్ అయ్యింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











