హైలైట్స్
- జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro+
- 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తోన్న Redmi Note 12 Pro+
- ఒకే రోజున లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro+
Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని షావోమి ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. 2023 జనవరి 5 వ తేదీన Redmi Note 12 Pro+ భారత్ లో లాంచ్ అవుతోంది. Redmi Note 11 Pro+ కి సక్సెసర్ గా Redmi Note 12 Pro+ వస్తోంది. టాప్ వేరియంట్ అయిన Redmi Note 12 Pro+ 200 ఎంపి కెమెరాతో వస్తున్నట్లు షావోమి ఇండియా కన్ఫర్మ్ చేసింది. అఫీషియల్ టీజర్ ఇమేజ్ లో కేవలం Redmi Note 12 Pro+ మాత్రమే కనిపిస్తోంది. Redmi Note 12, Redmi Note 12 Pro ఫోన్లు కూడా జనవరి 5 నే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Redmi Note 12 సిరీస్ గత నెలలో చైనాలో లాంచ్ అయ్యింది. మరి 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi Note 12 Explorer Edition భారత్ లో లాంచ్ అవుతుందో లేదో తెలియదు.
Say ??????… to the BEST ?????????? you can get on a smartphone camera.
The #RedmiNote12 Pro+ 5G's ????? camera is here to open up a whole new world of photography on 05.01.2023!
Get Note-ified for the 200MP #SuperNote: https://t.co/IpGhoWCP40 pic.twitter.com/k0qreR9Ekl
— Xiaomi India (@XiaomiIndia) December 12, 2022
Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్
Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Redmi Note 12 Pro, Note 12 Pro+ స్పెసిఫికేషన్స్
Redmi Note 12 Pro, Note 12 Pro+ ఫోన్లు 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి.
Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. మరోవైపు Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Note 12 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Redmi Note 12 Pro+ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.