Home News 50MP Sony IMX766 కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Redmi Note 12 Pro

50MP Sony IMX766 కెమెరా, 67W ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Redmi Note 12 Pro

హైలైట్స్

నేడు భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+, Redmi Note 12 5జీ. ఇప్పుడు మనం Redmi Note 12 Pro గురించి తెలుసుకుందాం. ఇది ఈ మూడింట్లో మిడ్-వేరియంట్ డివైజ్. ఎన్నో ఆసక్తికరమైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12 Pro డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ చూద్దాం పదండి.

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro స్మార్ట్ ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లతో లాంచైంది. Redmi Note 12 Pro 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, సెంటర్ హోల్ పంచ్ కటౌట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

Redmi Note 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 12 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi Note 12 Pro 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Redmi Note 12 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Redmi Note 12 Pro 5G ధర, లభ్యత

Redmi Note 12 Pro 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా నిర్ణయించారు. ఇక 8జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.23,999 గా ఉంది. టాప్ వేరియంట్ అయిన 12జిబి ర్యామ్ + 256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. ఈ ధరలన్నీ రూ.3,000 ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ మరియు రూ.1,000 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ కలిపాక పేర్కొనబడిన ధరలు. జనవరి 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ మొదలుకానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.