హైలైట్స్
- 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+
- తాజాగా రివీల్ అయిన Redmi Note 12 Pro+ యొక్క భారత మార్కెట్ ధర
- భారత్ లో Redmi Note 12 Pro+ ధర రూ.24,999, జనవరి 5 న లాంచ్ కానున్న హ్యాండ్సెట్
Redmi సంస్థ ఇటీవలె Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు జనవరి 5 న లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి. దీంతో స్పెసిఫికేషన్స్ ఇప్పటికే అందరికీ తెలిసాయి. తాజాగా భారతీయ మార్కెట్ లో Redmi Note 12 Pro+ ధర ఎంతో తెలిసింది. Redmi Note 12 Pro+ ప్రారంభ ధర రూ.24,999 అని ఓ లీక్ ద్వారా తెలిసింది. మొత్తం మూడు వేరియంట్లలో ఫోన్ లభ్యం కానుంది.
భారత్ లో ‘రెడ్మీ నోట్ 12 ప్రో+’ ధర (లీక్డ్)
Here's Early Pricing for Redmi Note 12 Pro+ 5G ✅✅
6+128 = ₹24,999
8+256 = ₹26,999
12GB + 256GB = ₹28,999Including bank offers!
Most likely to go on sale from 11th January #Redmi #Supernote #RedmiNote12ProPlus
????????????????????
— Paras Guglani (@passionategeekz) December 19, 2022
Redmi Note 12 Pro+ ధరను ఇదేనంటూ ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఓ పోస్ట్ షేర్ చేశాడు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం, Redmi Note 12 Pro+ మూడు వేరియంట్లలో లాంచ్ కానుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ మూడు వేరియంట్ల ధరలు రూ.25,000 నుంచి రూ.29,000 మధ్యలో ఉంటాయి.
రెడ్మీ నోట్ 12 ప్రో+ స్పెసిఫికేషన్స్
Redmi Note 12 Pro+ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
Redmi Note 12 Pro+ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. ఇది 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
Redmi Note 12 Pro+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.