హైలైట్స్
- భారత్ లో లాంచైన Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్
- Redmi Note 12 Pro+ తో పాటు లాంచైన Redmi Note 12 Pro మరియు Redmi Note 12 5G ఫోన్లు
- 120 వాట్ హైపర్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వచ్చిన Redmi Note 12 Pro+
Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం భారతదేశంలోని రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది. నేడు భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Note 12 Pro+, Redmi Note 12 Pro, Redmi Note 12 5G ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో Redmi Note 12 Pro+ గురించి తెలుసుకుందాం.
Redmi Note 12 Pro+ డివైజ్ 200ఎంపి భారీ కెమెరాతో రావడం విశేషం. ఇందులో శాంసంగ్ సెన్సర్ ని వాడటం జరిగింది. ఈ ఫోన్ యొక్క ప్రధాన సెల్లింగ్ పాయింట్ ఇదేనని చెప్పవచ్చు. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12 Pro+ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Redmi Note 12 Pro+ ధర
Redmi Note 12 Pro+ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. Redmi Note 12 Pro+ యొక్క ధర రూ.24,999 తో ప్రారంభమవుతుంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.24,999. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.26,999. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్స్ కలుపుకుని ఈ ధరలు వర్తిస్తాయి.
200MP Samsung HPX సెన్సర్
Redmi Note 12 Pro+ లో ప్రధాన ఆకర్షణ ఏదైనా ఉందంటే అది 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్పీఎక్స్ సెన్సర్ అనే చెప్పాలి. ఈ కెమెరా సూపర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తోంది. లో-లైట్ ఫోటోగ్రఫీని ఈ సెన్సర్ ఆఫర్ చేయనుంది. 16 సార్లు ఇమేజ్ ని జూమ్ చేసినా డీటెయిల్స్ మిస్ కావని కంపెనీ చెబుతోంది. Pro Vlog Modes, యూనిక్ Film Frames వంటి ఫీచర్స్ ఇమేజెస్ ని మరింత మెరుగు పరచనున్నాయి. ఇది 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్ తో వచ్చింది. ఇంకా 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
Redmi Note 12 Pro+ ఇతర స్పెసిఫికేషన్స్
Redmi Note 12 Pro+ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
Redmi Note 12 Pro+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.