Home News 200MP కెమెరాతో వస్తోన్న Redmi Note 12 Pro+ 5G

200MP కెమెరాతో వస్తోన్న Redmi Note 12 Pro+ 5G

హైలైట్స్

త్వరలోనే చైనా మార్కెట్ లో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే లాంచ్ తేదీకి సంబంధించి సదరు కంపెనీ నుంచి ఒక అధికార ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ప్రకారం, Redmi Note 12 సిరీస్ చైనాలో అక్టోబర్ 27 న లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు డివైజెస్ ఉండనున్నాయి. అవి: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. ఇప్పుడు లాంచ్ కి ముందు Redmi Note 12 Pro+ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీఎక్స్ సెన్సర్ తో వస్తోందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

మరొక విషయం ఏంటంటే, Redmi Note 12 భారత వేరియంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డేటాబేస్ పై కనిపించింది. ఇప్పుడు Redmi Note 12 Pro+ కెమెరాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

లాంచ్ కి ముందు రివీల్ అయిన Redmi Note 12 Pro+ కెమెరా వివరాలు

 

Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ 200MP Samsung ISOCELL HPX సెన్సర్ తో వస్తున్నట్లు Redmi సంస్థ ఖరారు చేసింది. ఈ సెన్సర్ 1/1.4-ఇంచ్ సైజ్ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఈ లేటెస్ట్ సెన్సర్ ని శాంసంగ్ అనౌన్స్ చేసింది. శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీఎక్స్ సెన్సర్, సోని ఐఎంఎక్స్766 కంటే 24 శాతం పెద్దగా ఉంటుందని రెడ్మీ చెబుతోంది. ఈ విషయం తప్పితే, డివైజ్ కి సంబంధించిన ఇతర ఏ వివరాలను రెడ్మీ వెల్లడించలేదు. అయితే, టీజర్ ద్వారా Redmi Note 12 Pro+ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ఈ డివైజ్ Redmi Note 12 Pro మాదిరి కనిపిస్తోంది. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుందని అర్థమవుతోంది.

ఇక Redmi Note 12 సిరీస్ కెమెరా మాడ్యూల్ డిజైన్ గురించి మాట్లాడితే, Redmi Note 11T సిరీస్ మాదిరిగా కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం రెడ్మీ నోట్ 11టీ ప్రో, రెడ్మీ కే50ఐ పేరుతో భారత మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

Redmi Note 12 Pro లో సోని ఐఎంఎక్స్766 సెన్సర్ వాడినట్లు రెడ్మీ కంపెనీ ఖరారు చేసింది. Redmi Note 12 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే Redmi Note 12 Pro+ 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ విషయం 3సీ సర్టిఫికేషన్ ద్వారా బయటకు వచ్చింది.

BIS మరియు IMEI డేటాబేస్ లపై కనిపించిన Redmi Note 12

త్వరలో చైనాలో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్, ఐఎంఈఐ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. ఐఎంఈఐ డేటాబేస్ లో 22101316G (G అంటే గ్లోబల్ వేరియంట్ అని అర్థం) అనే మోడల్ నంబర్ తో కనిపించింది.

మరోవైపు Redmi Note 12 భారతీయ వేరియంట్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై దర్శనమిచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని గమనించాడు. Redmi Note 12 స్మార్ట్ ఫోన్ 22101316I (I అంటే ఇండియన్ వేరియంట్ అని అర్థం) అనే మోడల్ నంబర్ తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డేటాబేస్ పై కనిపించింది.

అయితే ఐఎంఈఐ మరియు బీఐఎస్ వెబ్ సైట్స్ పై కనిపించిన Redmi Note 12 కచ్చితంగా చైనా వేరియంట్ Redmi Note 12 స్మార్ట్ ఫోన్ అని చెప్పలేం. ఎందుకంటే ఇంతకు ముందు, రెడ్మీ నోట్ 11 చైనీస్ వేరియంట్, భారత్ లో రెడ్మీ నోట్ 11టీ 5జీ అనే పేరుతో మరియు రెడ్మీ నోట్ 11ఎస్ 5జీ అనే పేరుతో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. దీన్ని బట్టి సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించిన మోడల్స్ ఏవనేది కచ్చితంగా చెప్పలేం. అయితే Redmi Note 12 హ్యాండ్సెట్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించింది కాబట్టి, త్వరలోనే గ్లోబల్ ఎంట్రీ ఉంటుందని అంచనా వేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.